నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మంచు మనోజ్ విలన్ పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దాదా’ కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ 24నే విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ తీసుకొస్తున్నారు. కానీ మళ్ళీ రిలీజ్ వాయిదా రూమర్స్ ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటి గట్టు బదులు ఈ సినిమా వస్తుంది అని టాక్. కానీ దీనికి మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
బాలయ్య ఫింగర్ చూపిస్తూ దాదా గ్లింప్స్ నుంచి క్లిప్ పెట్టి సినిమా డిసెంబర్ 24నే విడుదల అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నవారికి కౌంటర్ అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో దాదా అనుకున్నట్టుగా 24నే విడుదల కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
DECEMBER 24th…..🎯🎯🎯
షెహరంతా అదిరిపోవాలి….
బాక్సాఫీస్ బద్దలైపోవాలి…#DADA https://t.co/QM1VNWxHJ8
— DADA (@NBKisDADA) November 28, 2026


