శర్వాని మళ్ళీ సంక్రాంతే సేవ్ చేస్తుందా?

శర్వాని మళ్ళీ సంక్రాంతే సేవ్ చేస్తుందా?

Published on Nov 28, 2026 10:30 AM IST

sharwanand

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకరు. ఈ ఏడాదిలోనే మూడు సినిమాలతో పలకరించిన శర్వా వీటిలో సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారి తో భారీ హిట్ కొట్టాడు. ఇక దీని తర్వాత వచ్చిన బైకర్ పర్వాలేదు అనిపించింది కానీ ఇప్పుడు వచ్చిన భోగి పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగానే ఉంది. అయితే మళ్ళీ తక్కువ గ్యాప్ లోనే శర్వా నుంచి నెక్స్ట్ సినిమా వచ్చేస్తుంది.

దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో ప్లాన్ చేసిన జార్జ్ క్రిష్ తో మళ్ళీ సంక్రాంతికి శర్వానంద్ రాబోతున్నాడు. సో మళ్ళీ తనకి ఎంతగానో కలిసొచ్చిన సంక్రాంతి బరిలోనే బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ఈ సినిమాపై కూడా డీసెంట్ బజ్ ఉంది. పైగా ఎంటర్టైనర్ కాబట్టి మళ్ళీ మినిమమ్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. సో ఈ సినిమాతో సేవ్ అవుతాడేమో అనేదో చూడాలి. ఇక ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు