‘వారణాసి’పై ఓపెన్ అయ్యిన జక్కన్న.. కానీ..!

‘వారణాసి’పై ఓపెన్ అయ్యిన జక్కన్న.. కానీ..!

Published on Nov 28, 2026 8:01 AM IST

varanasi

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రానున్న అవైటెడ్ సినిమాల్లో ఒకటే ‘వారణాసి’. గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పుడు నెలకొన్న సస్పెన్స్ ఫ్యాన్స్ లో సస్పెన్స్ గా మారింది.

మేకర్స్ ఎప్పుడో ఎంతో నమ్మకంగానే డేట్ ని అనౌన్స్ చేసేసారు. కానీ ఇప్పుడు సమయం దగ్గరకి వస్తున్నప్పటికీ పెద్దగా అప్డేట్స్ రివీల్ చేయకపోవడంతో మళ్ళీ విడుదల వాయిదా అంటూ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే లేటెస్ట్ గా ఆకాశంలో ఒక తార సక్సెస్ ఈవెంట్ కి హాజరైన రాజమౌళి వారణాసి అప్డేట్ కోసం మాట్లాడుతూ త్వరలో ఉంటుంది అని సింపుల్ గా చెప్పేసారు.

అయితే ఓపెన్ అయ్యినందుకు సంతోషపడాలా లేక, సింపుల్ గా త్వరలో అంటూ చెప్పడంతో బాధ పడాలా అనే పరిస్థితిలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ త్వరలో అంటే ఎప్పుడు అనేది చూడాలి. ముఖ్యంగా రిలీజ్ క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు