బాలయ్య రూలర్ గా విజృంభించడానికి ఇంకా కేవలం గంటల వ్యవధి మాత్రమే మిగిలివుంది. రూలర్ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఐతే సెంటిమెంట్స్ ని విపరీతంగా ఫాలో అయ్యే బాలయ్య రేపటి ఉదయం ఆటకు కూడా ముహూర్తం పెట్టారు. ఆయన ఆదేశాల మేరకు రూలర్ మూవీ రేపు ఉదయం 8:33 నిమిషాలకు మొదటి షో పడనుంది. దీని ప్రకారం ఈ రాత్రికి రూలర్ ప్రీమియర్ షోస్ కూడా ఉండకపోవచ్చు.
సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జై సింహ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తుండగా వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలయ్య రెండు భిన్నమైన పాత్రలు చేస్తున్న రూలర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక రూలర్ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్ అందించారు.


