రెండు తరాల పాత్రల్లో బాలయ్య !

రెండు తరాల పాత్రల్లో బాలయ్య !

Published on Feb 15, 2019 1:14 AM IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. రెండు తరాల చెందిన పాత్రల్లో బాలయ్య నటిస్తున్నారు. అందులో 30 సంవత్సరాల క్రితం జరిగిన కథలో ఒక పాత్ర కాగా.. అలాగే ప్రస్తుతం జరుగుతున్న కథలో ఒక పాత్రగా బాలయ్య నటించనున్నాడు. ఇప్పటికే ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అయితే

ఇక ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఉండవని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో కొంతవరకూ రాజకీయ నేపథ్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని మలచాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు