బాలయ్య షో..ఊహించిన దానికంటే ఎక్కువగానే..!

Published on Oct 10, 2021 12:04 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే సినిమాని కంప్లీట్ చేసేసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత మరిన్ని పవర్ ఫుల్ ప్రాజెక్ట్స్ కూడా బాలయ్య రెడీ చేస్తున్నారు. కానీ ఈ గ్యాప్ లో బాలయ్య ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయం ఓ ఓటిటి షోకి తాను హోస్ట్ గా మారడం. ఇది వరకు బాలయ్య నుంచి ఇలాటి స్టెప్ ఎవరూ ఊహించలేదు. దీనితో బాలయ్య షో ఎలా ఉండబోతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే “అన్ స్టాప్పబుల్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న ఈ ఓటిటి టాక్ షో డెఫినెట్ గా అందరూ పెట్టుకున్న అంచనాలకు మించే ఉండబోతుందట. అంతే కాకుండా కాకుండా బాలయ్య ఎనర్జిటిక్ హోస్టింగ్ ఈ షోకి మెయిన్ హైలైట్ గా నిలవనుంది అని గట్టి టాక్. అయితే తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో స్ట్రీమ్ కానున్న ఈ ఇంట్రెస్టింగ్ టాక్ షో దీవాళీ కానుకగా అందుబాటులోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :