నందమూరి బాలకృష్ణ తన మనవడు దేవాన్ష్ వల్ల ఆయనకు మొదటిసారిగా తాతయ్య హోదా వచ్చింది. దాంతో బాలయ్య మనవడుతో పోటీపడి మరి అల్లరి చేస్తారట. అందుకే నాన్నగారికి, దేవాన్ష్ ముద్దుగా ‘గోల తాత’ అని పేరు పెట్టేశాడు అని ఓ సందర్భంలో నారా బ్రాహ్మణి తెలిపారు. ఇప్పుడు బాలయ్య రెండో మనవడు ఆర్యవీర్ తో కూడా గోల చేయబోతున్నారు. బాలయ్య రెండో కుమార్తె తేజస్విని శ్రీభరత్‌లకు పండంటి మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఈ బాబుకు ఆర్యవీర్ అని నామకరణం చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘భరత్, తేజస్వినిలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆర్యవీర్ ఎంతో అదృష్టవంతుడు. మిమ్మల్ని తల్లిదండ్రులుగా పొందగలిగాడు’. అని లోకేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్నారు. ఆ తర్వాత బోయపాటి, వినాయక్ లతో బాలయ్య తన తదుపరి చిత్రాలను చేయనున్నారు.
Hearty congratulations to Bharat and Tejaswini! Aryaveer is one lucky baby to have you both as parents. Wishing you sweet times. pic.twitter.com/Xdw1JQUAY8
— Lokesh Nara (@naralokesh) July 8, 2018
