‘బెలూన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
Published on Nov 8, 2017 4:15 pm IST

అంజలి మరియు హీరో జై కలిసి నటిస్తోన్న హ‌ర్రర్ థ్రిల్ల‌ర్ ‘బెలూన్’. సినీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దిలీప్ సుబ్బరాయన్ మరియు అరుణ్ బాలాజి, నందన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో అంజలి దెయ్యంగా భయపెడితే హీరో జై జోకర్ గా నవ్వించబోతున్నాడు. హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నా జై ఈ సినిమాతో మంచి విజయం సాదించాలని కోరుకుందాం. తెలుగు ప్రేక్షకులకు అంజలి సుపరిచితం కావున ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

 
Like us on Facebook