బలుపు కాంబినేషన్ రిపీట్ కానుంది !

Published on May 10, 2019 3:00 am IST

మాస్ మాహారాజ్ రవితేజ ప్రస్తుతం ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ తో డిస్కో రాజా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండవ షెడ్యూల్ లోకి అడుగు పెట్టనుంది. ఇక ఈసినిమా సెట్స్ మీద ఉండగానే రవితేజ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

అందులో భాగంగా గోపిచంద్ మలినేని తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు రవితేజ. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను , బలుపు చిత్రాలు తెరకెక్కగా ఈరెండు మంచి విజయాలను సాధించాయి. మరి ఇప్పుడు ఈచిత్రంతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్నా ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

More