ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసిన మహేష్, బన్నీ !

ఈ ఏప్రిల్, మే నెలల్లో విడుదలకానున్న భారీ చిత్రాలు మహేష్ యొక్క ‘భరత్ అనే నేను’, బన్నీ నటించిన ‘నా పేరు సూర్య’. ఈ చిత్ర విజయాలు ఇద్దరు హీరోలకు చాలా కీలకం. ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు. ముందుగా విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ పై బోలెడంత పాజిటివ్ క్రేజ్ ఉండగా ఆ తరవాత రాబోవుతున్న ‘నా పేరు సూర్య’ పై కూడ మంచి అభిప్రాయమే ఉంది ప్రేక్షకుల్లో.

ఈ పాజిటివ్ వైబ్స్ ను కంటిన్యూ చేసేందుకు సినిమాను జనానికి ఇంకాస్త దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఇప్పటికే ఆడియోతో సందడి చేస్తున్న మహేష్ చిత్రానికి సంబంధించి రెండు రోజులకు ఒక సాంగ్ ప్రోమో, పోస్టర్ రిలీజవుతూ అభిమానుల్ని ఉత్సాహాపరుస్తుండగా ‘నా పేరు సూర్య’ నుండి వరుసగా పాటలు బయటికొస్తున్నాయి. ఈరోజు కూడ ‘బ్యూటిఫుల్ లవ్’ అనే పాట విడుదలైంది.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న రిలీజవుతుండగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ‘నా పేరు సూర్య’ మే 4న ప్రేక్షకుల ముందుకురానుంది.