సూపర్ స్టార్ మహేష్ సినిమా షూటింగ్ పూర్తి !

‘భరత్ అనే నేను’ సినిమా చివరి షెడ్యూల్ స్పెయిన్ లో పూర్తయ్యింది. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం ఏప్రిల్ 7 న హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు యూనిట్ సభ్యులు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించబోతున్నాడు.

‘భరత్ అనే నేను’ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదలకాగా మూడో పాటను ఈరోజు సాయంత్రం విడుదల చెయ్యబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.