పోయేటిక్ టచ్ ఉన్న కమర్షియల్ సినిమా ‘చిత్రపటం’

Published on Jan 26, 2021 10:00 pm IST

నరేన్, పోసాని కృష్ణ మురళి, శరణ్య పొనవన్నన్, బాలాచారి, నూకరాజు, శ్రీ వల్లి నటీనటులుగా రూపొందిన చిత్రం ‘చిత్రపటం’. శ్రీ క్రియేషన్ పతాకంపై పుష్పాల శ్రీధర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరిగారి వద్ద శిష్యరికం చేసిన బండారు దానయ్య కవి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈయన గతంలో ‘బావ మరదళ్లు, సతీ తిమ్మమాంబ’, చిన్నపిల్లల సినిమా ‘జీనియస్’ లాంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈయనకు మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ,సుకుమార్, రాజమౌళి ల దగ్గర లిరిసిస్ట్ గా చేసిన అనుభవం
కూడ ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.

ఈ సినిమా గురించి మాట్లాడిన దర్శకుడు ‘మనందరం ఏవైనా చేసుకోవాలన్న, తినాలన్న ఇంటర్నెట్ పై ఆధారపడి ఉన్నాము.అయితే సెల్ ఫోన్ లో గూగుల్ లోగాని, ఇంటర్నెట్ లోగాని, రేడియోలో గానీ ఇంట్లో గానీ, మన కుటుంబం లోనే, మన మనసులో, మన స్పర్శలో, మన చుట్టూ ఉన్నా మనందరం దాన్ని వెతుక్కోలేకపోతున్నాం.. అదే ఎమోషన్. ఆ ఎమోషన్ కంటెంట్ తోనే ఈ సినిమా తీయడం జరిగింది. ఇది పొయేటిక్ టచ్ తో వస్తున్న కమర్షియల్ సినిమా. అలాగని ఇది పూర్తి పోయేటిక్ సినిమా కాదు. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు. అలాగే సినిమాలో కామెడీ, వల్గారిటీ లాంటివి ఉండవని, తండ్రి, కూతురు మధ్య అల్టిమేట్ ఎమోషన్ కంటెంట్ తో ఈ మూవీ చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత సమాచారం :