త్వరలో ట్విట్టర్‌కి గుడ్‌బై.. బండ్ల గణేశ్ షాకింగ్ అనౌన్స్‌మెంట్..!

Published on Aug 14, 2021 7:00 pm IST

బండ్ల గణేశ్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నిర్మాతగా మారిపోయాడు. మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. కాంట్రవర్సీ కామెంట్స్ మధ్య నలిగిపోయి తిరిగి సినిమాల్లోకి వచ్చేశాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేశ్ వ్యక్తిగత విషయాలే కాకుండా బయట సమాజంలో జరిగే అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.

అయితే బండ్ల గణేశ్ ఉన్నట్టుండి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే తాను ట్విటర్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. అంతేకాకుండా నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దని, నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా బతకాలని అనుకుంటున్నట్టు ట్వీట్ ద్వారా తెలిపాడు. అయితే బండ్ల గణేశ్ హఠాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? దీని వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? అని ఆయన అభిమానులు ఒకింత ఆలోచనలో పడ్డారు. మరి దీనిపై బండ్ల గణేశ్ ఏమైనా క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :