పవన్ మీటింగ్ ముందు బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!

పవన్ మీటింగ్ ముందు బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!

Published on Mar 14, 2025 4:59 PM IST

మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు తన పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పవన్ ఉప ముఖ్య మంత్రి హోదాలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నేడు భారీ ఎత్తున తన పార్టీ ఆవిర్భావ సభని తన నియోజకవర్గంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ సభలో పవన్ స్పీచ్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ మీటింగ్ కి ముందు పవన్ కి సన్నిహితుడు తన నిర్మాత అలాగే తన భక్తుడు బండ్ల గణేష్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. “ఒక్క వీరుడు తను సాధించిన విజయంతో ఊరుకోడు… ఆ విజయాన్ని పంచి, మరికొందరికి మార్గం చూపుతాడు! “విజయం ఒక గమ్యం కాదు, ఓ వీరుడి ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే!” అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి మరీ తన బాస్ అంటూ తన మార్క్ ఎలివేషన్ ని సోషల్ మీడియాలో అందించారు. దీనితో ఈ పోస్ట్ ఇపుడు అభిమానుల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు