భక్తుడికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !

Published on Sep 28, 2020 12:14 pm IST

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ను బండ్ల గ‌ణేష్ ఎట్టకేలకూ తన నిర్మాణంలో సినిమా చేయడానికి ఒప్పించాడు. బండ్ల గ‌ణేష్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘నా బాస్ సరే అన్నారు. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌ కళ్యాణ్ కి ధన్యవాదాలు’ అంటూ బండ్ల పోస్ట్ చేశారు. పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు అభిమానులు ఎంతమంది ఉన్నా…. పవన్ కి తాను భక్తుడ్ని అని అవకాశం దొరికినప్పుడల్లా చెప్పే బండ్ల గ‌ణేష్ మొత్తానికి తన దేవుడితో మరో సినిమా చేయబోతున్నాడు.

బండ్లకు పవర్ స్టార్ తో ఎప్పటినుండో మళ్లీ ఓ సినిమా చేయాలని ఉంది. దాని కోసం పవన్ ను ఒప్పించడానికి గత కొన్ని నెలలుగా ముమ్మరంగానే ప్రయత్నాలు చేసి.. ఎలాగోలా పవన్ కళ్యాణ్ ను కన్వీన్స్ చేశాడు. బండ్ల ఎలాగైనా పవన్ తో మళ్లీ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేయాలనీ ఆశ పడుతున్నాడు.

కాగా వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా మొదలుపెట్టేలా బండ్ల ప్లాన్ చేస్తున్నాడట. ఆ మేరకు కొంతమంది స్టార్ డైరెక్టర్స్ తో కూడా ఇప్పటికే మాట్లాడాడు అట. ఎలాగూ కాంబినేషన్ లను కలిపేసి సినిమాలు నిర్మించడంలో బండ్ల గణేష్ కు బాగా అనుభవం. మరి పవర్ స్టార్ తో చేస్తోన్న ఈ సినిమాకి ఏ స్టార్ డైరెక్టర్ ను ఒప్పిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More