“బంగార్రాజు” నుంచి చార్ట్ బస్టర్ కూడా స్టార్ట్ అయ్యింది..

Published on Nov 9, 2021 10:59 am IST


అక్కినేని నాగార్జున హీరోగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన” తన కెరీర్ లో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో తెలిసిందే. దీనిని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరింత సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ గా తీర్చిదిద్దనున్నారు. మరి ఈ ప్లాన్ లోనే తీస్తున్న లేటెస్ట్ సినిమా “బంగార్రాజు”.

కింగ్ నాగ్ మాత్రమే కాకుండా తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తున్న ఈ అక్కినేని ఫ్యాన్స్ ట్రీట్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ చేశారు. లాస్ట్ టైం సోగ్గాడే చిన్ని నాయన కి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి కూడా అలాంటి ఆల్బమ్ నే సిద్ధం చేసినట్టు ఈ లిరికల్ సాంగ్ వింటే అర్ధం అవుతుంది.

ముఖ్యంగా ఈ సాంగ్ ట్యూన్ నాగ్ వాయిస్ ఇంకా ఈ సాంగ్ లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రామిసింగ్ గా ఉంది. ఇక ఈసారి బంగార్రాజు ఎలాంటి సందడి చేయనున్నాడో తెలియాలి అంటే వచ్చే జనవరి 15 వరకు ఆగాల్సిందే.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :