బన్నీ ఆర్మీ ఉత్సాహం మాములుగా లేదు

Published on Jan 11, 2020 11:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందని గొప్పగా చెప్పుకుంటాడు. ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి అనేక విషయాలలో బన్నీ ఫ్యాన్స్ ఆయనపై చూపించిన ఆదరాభిమానాలే. అల వైకుంఠపురంలో షూటింగ్ కొరకు బన్నీ గతంలో కాకినాడకు వెళ్ళాడు. బన్నీ షూటింగ్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఏకం చేసి ఆయనకు పెద్ద ర్యాలీ తో ఘనస్వాగతం పలికారు. అభిమానులతో పాటు ఆయన ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. కాగా రేపు బన్నీ నటించిన అల వైకుంఠపురంలో చిత్ర విడుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ చిత్రం ప్రదర్శించనున్న థియేటర్స్ దగ్గిర భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తున్నారు. తాడేపల్లి గూడెంలో కొందరు ఫ్యాన్స్ దారిపొడవునా ఓ పెద్ద ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు.

ఈ ఏవిధంగా బన్నీ ఫ్యాన్స్ తమ హీరో సినిమా విడుదలను ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.ఇక అల వైకుంఠపురంలో మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా..టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక రోల్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :