నైజాం లో బన్నీ కూడా బాగానే బాదాడు..!

Published on Jan 20, 2020 10:20 am IST

అల వైకుంఠపురంలో బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోనుంది. బన్నీ గత చిత్రాల రికార్డ్స్ మొత్తం ఇప్పటికే ఈ మూవీ చెరిపి వేసింది . ఇక యూఎస్ లో $2.5 మిలియన్ వసూళ్లు దాటివేసిన ఈ మూవీ $3 మిలియన్ వసూళ్లకు దగ్గరవుతుంది. కాగా నైజాంలో కూడా అల్లు అర్జున్ కెరీర్ హైయెస్ట్ కి చేరుకుంది ఈ చిత్రం. అల వైకుంఠపురంలో నిన్నటి వరకు 31.86 కోట్ల షేర్ సాధించింది. ఒక్క ఆదివారమే మూడు కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. అల వైకుంఠపురంలో బన్నీ కెరీర్ లో నైజాంలో 30కోట్ల షేర్ సాధించిన మొదటి చిత్రం.

దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ హాస్యంతో పాటు యాక్షన్ అంశాలతో కథను చక్కగా అల్లాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్స్ కి మంచి స్పందన వస్తుంది . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించారు. అల వైకుంఠపురలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

సంబంధిత సమాచారం :

X
More