బన్నీ-సుకుమార్ టైటిల్ పై స్పష్టత ఇచ్చిన నిర్మాతలు.

Published on Jan 20, 2020 2:20 pm IST

బన్నీ ప్రస్తుతం అల వైకుంఠపురంలో మూవీకి వస్తున్న రెస్పాన్స్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న విశాఖ వేదికగా జరిగిన విజయోత్సవ వేడుకలో బన్నీ అల వైకుంఠపురలో లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ కి, మరియు ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బన్నీ తన తదుపరి చిత్రం దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన సుకుమార్ ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. నెక్స్ట్ షెడ్యూల్ కొద్దిరోజులలో ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఓ ఆసక్తికర వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాలలో ప్రచారం అవుతుంది. సుకుమార్- బన్నీ చిత్ర టైటిల్ విషయంలో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని నిర్మాతలు స్పష్టత ఇచ్చారు.

బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈమూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ టైటిల్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. అలాగే శేషాచలం అనే టైటిల్ పెట్టారంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని చెప్పారు. ఈ చిత్రం శేషాచలం అడవుల్లో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తరుణంలో కొందరు ఈ చిత్రానికి శేషాచలం అనే టైటిల్ నిర్ణయించారు, అని ప్రచారం చేశారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More