సమీక్ష : బీచ్ రోడ్ చేతన్ – మెప్పించలేకపోయిన చేతన్ ప్రయత్నం

Published on Nov 23, 2019 6:00 pm IST

విడుదల తేదీ : నవంబర్ 22, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : చేతన్ మద్దినేని, తేజా రెడ్డి

దర్శకత్వం : చేతన్ మద్దినేని

నిర్మాత‌లు : చేతన్ మద్దినేని

సంగీతం :  శామ్యూల్ జె. బెనయ్య

సినిమాటోగ్రఫర్ : నితేశ్ రెడ్డి

ఎడిటర్:  ఎం ఆర్ వర్మ

ఈ ఏడాది ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన చేతన్ మద్దినేని, ‘బీచ్ రోడ్ చేతన్’ అనే మరో చిత్రం చేయడం జరిగింది. తేజా రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈచిత్రం ఓ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కింది. నేడు విదులైన బీచ్ రోడ్ చేతన్ చిత్రానికి నిర్మాత, మరియు దర్శకుడు హీరో చేతన్ కావడం విశేషం. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందా…

 

కథ:

 

పనీ పాట లేకుండా జులాయిగా తిరిగే చేతన్(చేతన్ మద్దినేని) కి ఒకరోజు వైజాగ్ సముద్ర తీరంలో ఐ ఫోన్ దొరుకుతుంది. తనకు దొరికిన మొబైల్ కి కొన్ని అతీత శక్తులు ఉన్నట్లు గ్రహించిన చేతన్ గతంలోకి వెళ్లి కొన్ని సంఘటనలను మార్చి వేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో చేతన్ తన కుటుంబాన్ని, తాను ప్రేమించిన శృతి(తేజా రెడ్డి) ని కోల్పోతాడు. మరి తన దగ్గరున్న అద్భుత శక్తులు గల మొబైల్ తో తన ప్రియురాలిని, తల్లి తండ్రులను తిరిగి పొందగలిగాడా? అసలు ఆ ఫోన్ ఎక్కడిది? ఆఫోన్ వలన చేతన్ జీవితంలో సంభవించిన మార్పులు ఏమిటీ అనేది? తెరపైన చూడాలి

 

ప్లస్ పాయింట్స్:

 

నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా అనేక బాధ్యతలు ఈ మూవీ కొరకు తలకెత్తుకున్న చేతన్ మద్దినేని ని ప్రశంసించాల్సిందే. ఇక యాక్టింగ్ పరంగా కూడా చేతన్ చాలా ఇంప్రూవ్ ఐయ్యాడు. తన గత చిత్రాలతో పోల్చుకుంటే చేతన్ ఈ మూవీలో నటనలో పరిపక్వత చూపించాడు. అలాగే ఈ మూవీలో భిన్న ఎమోషన్స్ చూపించక గల పాత్రను చేశారు. స్నేహితులతో వచ్చే సన్నివేశాలలో అతని నటన చాలా సహజంగా అనిపిస్తుంది.

నటన పరంగా మరియు లుక్స్ పరంగా హీరోయిన్ తేజా రెడ్డి నచ్చుతుంది. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ తన పాత్ర పరిధిలో పర్వాలేదనిపించారు.

ఇక పతాక సన్నివేశాలకు ముందు 10నిముషాలు పాటు మూవీ ఆసక్తిరేపుతుంది. మూవీ థీమ్ మొత్తం ఎలివేట్ ఐయ్యేలా నడిచే ఆ పది నిమిషాల సన్నివేశాలు అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

 

చేతన్ ఎంచుకున్న కథలో కొత్తదనం తో పాటు, చాలా మంచిగా తెరపై ఆవిష్కృతం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దానిని ఉపయోగించుకోలేక పోయాడు. అసలు ఏమాత్రం ఆసక్తి కలగని ట్రీట్మెంట్ తో సినిమా తెరకెక్కించి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.

వాస్తవానికి దూరంగా మొబైల్ లో ఉన్న వీడియో ద్వారా గతంలోకి వెళ్లడం, ఆ సంఘటనలను మార్చివేయడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులకు రుచించవు.

ఎటువంటి మలుపులు లేకుండా ఫ్లాట్ గా సాగే నెరేషన్ మరియు, బలహీనమైన స్క్రీన్ ప్లే సినిమాను అనాసక్తిగా మలిచాయి. దీనితో బీచ్ రోడ్ చేతన్ ప్రేక్షకుడిని ఏస్థాయిలో కూడా మెప్పించదు. అలాగే మూవీలో చాలా సన్నివేశాలు కథకు సంబంధం లేకుండా ఉండటంతో మూవీకి భారంగా తయారయ్యాయి.

 

సాంకేతిక విభాగం:

 

ఈ మూవీ రాయడం దగ్గరినుండి దర్శకత్వం, నిర్మాణం, నటన ఇలా అనేక బాధ్యతలు తీసుకున్న చేతన్ వీటిలో దేనికీ న్యాయం చేయలేకపోయాడు. ఎంచుకున్న కథకు తగ్గట్టుగా ఆసక్తికరమైన సన్నివేశాలు మరియు కథనం రాసుకొని ఉంటే మూవీ ఫలితం వేరేలా ఉండేది. నటన పరంగా పర్వాలేదనిపించిన చేతన్ దర్శకుడిగా విఫలం చెందాడు.

ఐఫోన్ 7తో చిత్రీకరించిన ఈ మూవీ సన్నివేశాలకు సంబందించి ప్రదేశాలు చక్కగా బంధించినా, లైటింగ్ మరియు విజువల్స్ పరంగా అంత క్వాలిటీగా లేవు. ఎడిటర్ వర్మ పనితం ఏమంత ఆశా జనకంగా లేదు. దగ్గిరదగ్గిర 15నిమిషాల నిడివి తగ్గించే ఆస్కారం కలదు.

ఐతే మ్యూజిక్ కొంతమేర ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్టుగా బీజీఎమ్ మరియు సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఓ పాట పరవాలేదనిపిస్తాయి.

 

తీర్పు:

 

ఒక నూతనమైన కథాంశాన్ని ఎన్నుకొన్న చేతన్ దానిని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడంలో విజయం సాధించలేక పోయాడు. నిరుత్సాహపరిచే సన్నివేశాలు, ఎటువంటి మలుపులు లేని కథనం ప్రేక్షకుడికి అనుభూతిని కలిగించవు. దర్శక నిర్మాతగా, నటుడిగా అనేక బాధ్యతలు తీసుకున్న చేతన్ మూవీని ఆసక్తిగా మలచడంలో విఫలం చెందాడు. ఒక ఫిక్షనల్ ఫాంటసీ స్టోరీని సాదా సీదా సన్నివేశాలతో తెరకెక్కించి నిరుత్సాహపరిచాడు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :

X
More