‘ప్రతిరోజూ పండగే’ అంటున్న తేజ్

Published on Jun 11, 2019 2:11 am IST

మారుతి సినిమాలు టైటిల్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. సినిమాలో అందించే వినోదాన్ని టైటిల్ దగ్గర్నుండే స్టార్ట్ చేస్తారాయన. ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ లాంటి టైటిల్స్ ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్.

ఈ చిత్రానికి మొదట్లో ‘భోగి’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ అనే పేరు తెరమీదికి వచ్చింది. దీన్నే దర్శకనిర్మాతలు ఫైనల్ చేశారని తెలుస్తోంది. టైటిల్ వింటుంటే సినిమా కూడా పండగలా ఉంటుందనే అనిపిస్తోంది. ఇందులో తేజ్ ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం తేజ్ బాగా బరువు తగ్గి సన్నబడ్డాడు.

సంబంధిత సమాచారం :

More