ప్రేక్షకుల మౌత్ టాక్ తోనే బీరువా హిట్ అయ్యింది – సందీప్ కిషన్

ప్రేక్షకుల మౌత్ టాక్ తోనే బీరువా హిట్ అయ్యింది – సందీప్ కిషన్

Published on Feb 3, 2015 9:06 PM IST

sundeep-kishan
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బీరువా’. జనవరి 23న రిలీజ్ అయిన రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఆడియన్స్ పాజిటివ్ మౌత్ టాక్ తో సినిమా సక్సెస్ఫుల్ గా రన్ గా రన్ అవ్వడమే కాకుండా ఫస్ట్ వీకెండ్ తర్వాత సుమారు 70 థియేటర్స్ పెరిగాయి. దాంతో ఈ సినిమా సెకండ్ వీక్ లో ఈ చిత్ర టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

సక్సెస్ మీట్ లో సీనియర్ నరేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను సందీప్ కిషన్ కలిసి చేసిన కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. నేను అనుకున్నట్టుగానే తెలుగు ప్రేక్షకులు స్లోగా తమ మౌత్ పబ్లిసిటీతో పెద్ద హిట్ చేసారు. ఇలాంటి సినిమాలను ఆదరించి, మమ్మల్ని ప్రోత్సహించాలని’ కోరుకుంటున్నాను.

కెమెరామెన్ చోటా కె. నాయుడు మాట్లాడుతూ ‘ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాలనే ఉద్దేశంతో మేమంతా కలిసి బీరువా సినిమాని రెడీ చేసాము. కానీ ఆ సినిమాకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. దాంతో నేను చాలా బాధ పడ్డాను. కానీ నాలుగో రోజు నుంచి మౌత్ టాక్ పాజిటివ్ గా వచ్చింది. ఆ తర్వాత థియేటర్స్ కి ఆడియన్స్ పెరిగారు, అలాగే థియేటర్స్ కూడా పెరిగాయి. అందుకే సెకండ్ వీక్ కూడా చూసుకొని సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం. ఈ సినిమాని హిట్ చేసిన అందరికీ నా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాని’ అన్నాడు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ అందరూ చెప్పినట్టే ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేసాం, కానీ మొదటి వీకెండ్ మమల్ని నిరాశపరిచింది, కానీ 4వ రోజు నుంచి ప్రేక్షకుల పాజిటివ్ టాక్ తోనే హిట్ అయ్యింది. ప్రేక్షకుల మౌత్ టాక్ లేకపోతే ఈ సినిమా లేదు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాజిటివ్ టాక్ రావడంతో 70కి పైగా థియేటర్స్ ని పెంచారు. వాళ్ళు మేము సేఫ్ అయ్యాం సినిమాకి మంచి హిట్ టాక్ ఉంది అన్నాకే ఈ సక్సెస్ మీట్ చేస్తున్నాం. ఈ సినిమా విజయంలో తోడ్పడిన ప్రేక్షకులకు, మీడియా వారికి నా ధన్యవాదాలు’ అని అన్నాడు.

తాజా వార్తలు