బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ.

Published on Aug 6, 2019 2:30 pm IST

నిర్మాత బెల్లంకొండ సురేష్ నిన్న రాక్షసుడు చిత్ర విజయాన్ని పురస్కరించుకొని, ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. రాక్షసుడు చిత్రానికి సర్వత్రా ప్రశంసలు అందడంతో పాటు, వసూళ్లు కూడా బాగున్నాయి అన్నారు. ముఖ్యంగా యూఎస్ లో మొదటి రోజుకు మించిన స్పందన శని, ఆదివారాలలో రావడమే చిత్ర విజయానికి నిదర్శనం అన్నారు.

“రాక్షసుడు” చిత్రానికి ముందు శ్రీనివాస్ ఆరు చిత్రాలు చేశారని, ఆ ఆరు చిత్రాలు ఒకెత్తైతే ప్రస్తుత చిత్రం “రాక్షసుడు” ఒక ఎత్తు అని కొనియాడారు. బెల్లంకొండ నటించిన “స్పీడున్నోడు”,”కవచం” లాంటి చిత్రాల హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతున్నాయి అన్నారు.నార్త్ ఇండియా లో అత్యంత ప్రజాదరణ కలిగిన సౌత్ స్టార్స్ లో బెల్లంకొండ ఒకరని అన్నారు. ఇదే సంధర్బములో శ్రీనివాస్ తో ఆయన ఓ హిందీ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం స్పష్టం అయినది.

సంబంధిత సమాచారం :