‘అల్లుడు శ్రీను’ కి ఐదేళ్లు…!

Published on Jul 25, 2019 7:20 pm IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిశ్రమకు హీరోగా పరిచమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ వి వి వినాయక్ అతిధిగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అరంగేట్రమే అదిరి పోయే రేంజ్ లో జరిగింది. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ,స్టార్ హీరోయిన్ సమంత జోడీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “అల్లుడు శ్రీను” చిత్రంతో ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఈ సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున 2014కి ఈ మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. అల్లుడు శీను సినిమాలో తమన్నా ప్రత్యేక గీతంలో నటించడం మరో ప్రత్యేకత. మొదటి సినిమాతోనే యాక్షన్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ గుర్తింపు పొందాడు. ఆరడుగుల హైట్, కండలు తిరిగిన బాడీ గల బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ హీరోకి పర్ఫెక్ట్ మ్యాచ్.

ఈ మూవీ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడు అనే చిత్రం చేయడం జరిగింది. ఆ తరువాత జయ జానకి నాయక,సాక్ష్యం,కవచం, అంటూ ఆయన ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నీ దాదాపు యాక్షన్ జానర్ కి చెందినవే. తాజాగా విడుదలైన “సీత” చిత్రంలో మాత్రం కొంచెం వైవిధ్యమైన పాత్రను చేశాడు. కాగా బెల్లంకొండ,అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ “రాక్షసుడు” ,మూవీ వచ్చే నెల 2న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :