బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “టైసన్ నాయుడు” షూటింగ్ అప్డేట్!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “టైసన్ నాయుడు” షూటింగ్ అప్డేట్!

Published on May 24, 2024 10:06 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైసన్ నాయుడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఈరోజు, మేకర్స్ రాజస్థాన్‌లో రెండు వారాల నిడివి గల షెడ్యూల్‌ను ప్రారంభించారు.

ఈ చిత్రం లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటలలో ఈ షూటింగ్ జరుగుతుంది. రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్‌ని కూడా షూట్ చేయనున్నారు మేకర్స్. ఈ సబ్జెక్ట్‌ పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు. గ్లింప్స్‌ లో చూపిన విధంగా బెల్లంకొండ సినిమాలో మాస్ లుక్‌లో ఉన్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు