స్పీడు పెంచిన బెల్లంకొండ !

స్పీడు పెంచిన బెల్లంకొండ !

Published on Jun 30, 2018 12:42 PM IST

Bellamkonda srinivas

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత చిత్రం ‘జయ జానకి నాయక’ భారీ విజయాన్ని సాదించడంతో తర్వాతి సినిమాల్ని రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే శ్రీవాస్ డైరెక్షన్లో ‘సాక్ష్యం’ సినిమాను దాదాపుగా ముగించిన ఆయన ప్రస్తుతం తన 5వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

గత కొన్ని రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న చిత్రం యొక్క భారీ షెడ్యూల్ ఈరోజుటితో ముగిసింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ డైరెక్టక్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను వంశధార క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇకపోతే ఆయన 4వ చిత్రమైన ‘సాక్ష్యం’ జూలై 20న విడుదలకానుంది.

తాజా వార్తలు