“ఛత్రపతి” టీజర్ తో హాట్ టాపిక్ గా మారిన బెల్లంకొండ శ్రీను.!

Published on Mar 30, 2023 11:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి చాలా మంది హీరోస్ లో నార్త్ బెల్ట్ లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న వారిలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు. మరి తన సినిమాలతో హిందీలో వరల్డ్ రికార్డు నే సెట్ చేసిన తాను ఇదే క్రేజ్ తో అయితే హిందీలో స్టార్ట్ చేసిన సినిమానే “ఛత్రపతి”. తెలుగులో జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కలయికలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమాకి రీమేక్ గా అయితే బెల్లంకొండ శ్రీను డైరెక్ట్ హిందీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అయితే మొదట్లో సినిమా విషయంలో కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా ఇపుడు వినాయక్ మరియు శ్రీనివాస్ లు ఊహించని ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ప్రస్తుతం హిందీ బెల్ట్ లో నాచురల్ స్టార్ నాని “దసరా” రిలీజ్ తో ఛత్రపతి టీజర్ ని ప్లే చేశారు. దీనితో ఈ క్లిప్స్ ఇప్పుడు వైరల్ గా మారగా మెయిన్ గా అందులో విజువల్స్ ఒకొక్కరికి షాకింగ్ గా మారాయి. దీనితో ఇప్పుడు ఈ టీజర్ కోసం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

సంబంధిత సమాచారం :