మరో ఆసక్తికర స్క్రిప్ట్ తో రెడీ అవుతున్న బెల్లంకొండ శ్రీను.!

Published on Aug 11, 2021 11:39 am IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన మొదటి సినిమా నుంచి కూడా తానేంటో ప్రూవ్ చేసుకొని సాలిడ్ లైనప్ తో ఇప్పుడు సిద్ధం అవుతున్నాడు. మరి ఈ ఆనతి కాలంలోనే ఏకంగా బాలీవుడ్ ఎంట్రీకే రెడీ అయ్యిన శ్రీనివాస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అండ్ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ కావడం జరిగింది. ఇది పీరియాడిక్ డ్రామాగా మేకర్స్ చెబుతున్నారు.

1970 ల కాలం నాటి టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి “స్టువర్ట్ పురం దొంగ” అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యడమే కాకుండా ఆ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసి ఆసక్తి రేకిత్తించారు. మరి ఈ చిత్రాన్ని కే ఎస్ మొట్టమొదటి సినిమాగా దర్శకత్వం వహిస్తుండగా సంగీత బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తుండడం విశేషం.

అలాగే ఇతర క్యాస్టింగ్ కి సంబంధించి కూడా సమాచారాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడి చేస్తామని కూడా తెలిపారు. అలాగే ఈ బిగ్ ప్రాజెక్ట్ ని నిర్మాత బెల్లంకొండ సురేష్ నే నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ చిత్రంతో బెల్లంకొండ శ్రీను మరో మెట్టు ఎక్కుతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :