‘కందిరీగ’ ఫార్మాట్లోనే బెల్లంకొండ సినిమా

‘కందిరీగ’ ఫార్మాట్లోనే బెల్లంకొండ సినిమా

Published on Feb 14, 2020 8:18 PM IST

‘రాక్షసుడు’ చిత్రం ద్వారా వరుస పరజాయల నుండి బయటపడ్డాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఈ చిత్రం ఉంటుందట. ఆ చిత్రంలో ఉన్నట్టే హీరో పాత్ర ఫుల్ ఎనర్జీతో నడుస్తుందట.

‘కందిరీగ’లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టే ఇందులో కూడా ఇద్దరు కథానాయికలు నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించనున్నారు. అలాగే అందులో ఒక కీ రోల్ చేసిన సోనూ సూద్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇక ఫైట్స్ సంగతి సరేసరి. అన్నీ హైఓల్టేజ్ పోరాటాలే. రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ హీరో గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు