“రాక్షసుడు” ట్రైలర్ ట్రీట్ ఎప్పుడంటే…!

Published on Jul 17, 2019 8:40 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “రాక్షసుడు”. తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. స్కూల్ కివెళ్లే టీన్ ఏజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సైకో కిల్లర్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు.

కాగా రేపు ఈ మూవీ థియరిటికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆసక్తిరంగా ఉండటంతో ట్రైలర్ ఎలాఉంటుందోనన్న ఆసక్తి కలుగుతుంది. ఏ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ సమాయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :