ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో ‘బైలంపుడి’ !

Published on Jul 15, 2019 7:00 am IST

అనిల్ పి.జి.రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తారా క్రియేష‌న్స్ ప‌తాకం పై బ్ర‌హ్మానంద‌రెడ్డి నటిస్తూ నిర్మించిన చిత్రం `బైలంపుడి` . ఒక ఊరిలో జ‌రిగే వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన చిత్ర‌మిది. కాగా ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం సైబ‌ర్‌ క‌న్వెన్ష‌న్‌ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్యక్రమములో ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… `నాకు ఈ సినిమా విడుద‌ల‌వ్వ‌డానికి నా చిత్ర యూనిట్ అలాగే ఇక్క‌డ‌కి వ‌చ్చిన ఎంతో మంది అతిధులు చాలా హెల్ప్ చేశారు. శ్రీ‌నివాస్‌రెడ్డిగారు ఒక డిస్ట్రిబ్యూట‌ర్. రిలీజ్ విష‌యంలో చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాని అన్ని ఏరియాల్లో అమ్మేశారు. నేను ఇంత దూరం రావ‌డానికి నా కుటుంబ స‌భ్యులు నా వెను వెంటే వుండి న‌న్ను చాలా బాగా ప్రోత్స‌హించారు. మీరంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More