ఎన్టీఆర్ సినిమాలో బెంగాలీ స్టార్ !

Published on Jul 3, 2018 9:53 am IST

నందమూరి బాలకృష్ణ తన తండ్రి రామారావుగారి జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందించడానికి నడుం బిగించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. పలు అడ్డంకుల తర్వాత త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ బయోపిక్ కథలో పలు ముఖ్యమైన పాత్రలు పోషించడానికి ఇప్పటికే పలువురు కీలక నటీనటుల్ని తీసుకోగా ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారి పాత్ర కోసం బెంగాలీ నటుడ్ని తీసుకున్నారు.

ఆ నటుడి పేరు జిషు సేన్. ఎన్టీఆర్ ను 1949 లో వచ్చిన ‘మన దేశం’ చిత్రంతో వెండి తెరకు పరిచయం చేశారు ఎల్వి ప్రసాద్ గారు. అందుకే ఆయన పాత్ర ఎన్టీఆర్ జీవితంలో చాలా కీలకమైనది. జిషు సేన్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మణికర్ణిక’లో కూడ ఒక కీలక పాత్ర పోషించారు. ఇకపోతే ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :