ఈసారి వెనక్కి తగ్గేది లేదన్న ‘బేతాళుడు’ హీరో!
Published on Nov 29, 2016 8:30 am IST

bethaludu1

‘బిచ్చగాడు’ అనే ఒకే ఒక్క సినిమాతో తెలుగులో హీరోగా స్టార్‌డమ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ, తాజాగా ‘సైతాన్’ అనే సినిమాతో వస్తోన్న తెలిసిందే. తమిళంలో భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాను తెలుగులో ‘బేతాళుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ట్రైలర్‌తో ఇక్కడ కూడా విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా గత నెలలోనే విడుదల కావాల్సింది. భారత ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు చర్యతో సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందని భావించి రెండు సార్లు వాయిదా వేశారు.

ఇక రెండు సార్లు వాయిదా పడ్డాక డిసెంబర్ 1కి పక్కాగా ఫిక్స్ అయిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని చెప్పిన టైమ్‌కే థియేటర్ల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే సినిమాను రెండు సార్లు వాయిదా వేశామని, ఈసారి వెనక్కి తగ్గేదే లేదని విజయ్ ఆంటోనీ అన్నారు. ప్రదీప్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు.

 
Like us on Facebook