హిందీ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన ‘భగవంత్ కేసరి’

హిందీ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన ‘భగవంత్ కేసరి’

Published on Feb 3, 2024 3:00 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరి రేపు రాత్రి 8 గం. లకు హిందీ టెలివిజన్ ప్రీమియర్ గా కలర్స్ సినీ ప్లక్స్ ఛానల్ ద్వారా హిందీ ఆడియన్స్ ముందుకి రానుంది.

బాలకృష్ణ ఈ మూవీలో నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించగా ఆయన కూతురిగా శ్రీలీల నటించారు. మరి తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ హిందీ ఆడియన్స్ ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు