‘లెనిన్’ మూవీ నుంచి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఒక్క పోస్టర్‌తో ఇంప్రెస్ చేసిందిగా..!

‘లెనిన్’ మూవీ నుంచి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఒక్క పోస్టర్‌తో ఇంప్రెస్ చేసిందిగా..!

Published on Jan 2, 2026 8:43 PM IST

lenin 1

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే, ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసి, ఆమె నటించిన గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అయితే షెడ్యూల్ సమస్యల కారణంగా ఆమె ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బొర్సేను తీసుకున్నారు. ఇక తాజాగా భాగ్యశ్రీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, ట్రెడీషినల్ లుక్‌లో ఆమె ఆకట్టుకుంటుంది. ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జనవరి 5న విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున కింగ్ నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు