ఆర్జీవీ ‘భైరవగీత’ లేటెస్ట్ అప్ డేట్ !

ఆర్జీవీ ‘భైరవగీత’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 10, 2018 9:36 PM IST


నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందింన చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్రం నిజంగా జరిగిన ఓ హింసాత్మక ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిందని, ఈ సినిమా ఆసాంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తోంది.

కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 14వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

రాయలసీమ నేపధ్యంలో 1991 నాటి కాలంలో ఈ ‘భైరవగీత’ చిత్రం తెరకెక్కింది. ‘తగరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ హీరోగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి దర్శకుడు వేరే అయినప్పటికీ.. ఈ చిత్రం మాత్రం పూర్తిగా వర్మ శైలిలోనే తెరకెక్కినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు