‘భళా తందనాన’ మళ్ళీ మొదలైంది !

Published on Aug 9, 2021 8:00 pm IST

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న కొత్త సినిమా ‘భళా తందనాన’. ఈ ‘భళా తందనాన’లో శ్రీవిష్ణు సరసన కేథరిన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కాగా ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది.

హైదరాబాద్‌ లోనే కీలక సన్నివేశలను షూట్ చేస్తున్నారు. కాగా సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక చెైతన్య దంతులూరి దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు.

అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. మరి ఈ ‘భళా తందనాన’తో కమర్షియల్ గానూ సక్సెస్ అవుతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :