సమీక్ష : “భారతీయన్స్” – పరమ బోరింగ్ డ్రామా

Published on Jul 15, 2023 3:03 am IST
Bharateeyans Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

నటీనటులు: నిరోజ్ పుచ్చా, సమైరా సంధు, శుభ రంజన్, పెడెన్ ఓ నామ్‌గ్యాల్, సోనమ్ బర్ఫుంగ్‌పా, రాజేశ్వరి చక్రవర్తి

దర్శకుడు : దీనా రాజ్

నిర్మాత: డా.శంకర్ నాయుడు

సంగీతం: సత్య కశ్యప్

సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి

ఎడిటర్: శివ సర్వాణి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాల్లో ఓ చిన్న చిత్రం “భారతీయన్స్” కూడా ఒకటి. ఎన్నారై అయినటువంటి డాక్టర్ శంకర్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం తెలుగు హిందీలో వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు(నిరోజ్ పుచ్ఛా) నేపాలీ(సోనమ్ బర్పీహుంగఫలింగ్) పంజాబీ(సమైరా సందు) భోజ్ పూరి(సభా రంజన్) అలాగే పడెన్ ఓ నంగ్యల్(త్రిపుర) ఫైనల్ గా బెంగాలీ(రాజేశ్వరి చక్రవర్తి) అయితే ఈ అంతా ఇండియన్ ఆర్మీకి చెందిన వారు కాగా వీరు అందరిని ఓ సీక్రెట్ మిషిన్ మీద చైనాకి వెళ్లాలని చెప్తారు. అయితే ఈ ఛాలెంజ్ ని తీసుకున్న వారు తమ మిషిన్ ని విజయవంతంగా కంప్లీట్ చేసారా లేదా అనేది అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో చెప్పడానికి ప్లస్ పాయింట్స్ పెద్దగా ఏమీ కనిపించవు. ఉన్న మెయిన్ లీడ్ లో సోనమ్ పర్వాలేదనిపించే పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే కొన్ని సీన్స్ పర్వాలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ పలు విజువల్స్ ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో చాలా సిల్లీ అండ్ వరస్ట్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమా ఎందుకో కూడా అర్ధం కాదు. దేశభక్తి మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి అది చాలా సీరియస్ అంశం కానీ ఈ చిత్రంలో ఈ కీలకమైన ఎమోషన్ ని చాలా చెత్తగా ప్రెజెంట్ చేసారు. అసలు ఈ సినిమా తీసిన వారికి దేశభక్తి అంటే ఏంటో అయినా తెలుసో లేదో అనుమానం వస్తుంది.

ఇక ఈ సినిమాలో పాత్రలు కానీ వాటిని డిజైన్ చేసిన విధానం గాని మరింత వరస్ట్ గా ఉంటుంది అని చెప్పాలి. కేవలం ఒక్క రోజు ట్రైనింగ్ తో నేషనల్ మిషన్ లోకి పంపేయడం కొన్ని సీరియస్ సన్నివేశాలు ఎమోషనల్ సీన్స్ అయితే నవ్వు తెప్పించేలా ఉంటాయి ఆ రీతిలో సినిమాని తీశారు మేకర్స్.

ఈ సినిమా అంతా దాదాపు అలాగే ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఎంత సిల్లీ గా ఉంటాయి అంటే అసలు ఇండియా బోర్డర్ ని ఎవరైనా సరే చాలా సింపుల్ గా దాటెయ్యొచ్చు అనే రీతిలో చూపిస్తారు. ఇక ఈ సినిమాలో ఓ రా ఏజెంట్ కూడా మన “విక్రమ్” సినిమాలో టీనా తరహాలో ప్రెజెంట్ యత్నం చేసారు. అది కూడా చాలా సిల్లీ గా ఉంటుంది.

అసలు ఈ సినిమా ఏంటో దేనికోసం తీశారో అన్నట్టు ఉంటుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళకి అయితే అది అప్పుడే జరగదు అన్నట్టుగా ఆ నరేషన్ ఉంటుంది. ఇక విలన్ రోల్ చాలా వీక్ గా ఉండగా అసలు ఈ చిత్రం ఒక దేశభక్తి సినిమానా లేక ఓ ఫ్యాక్షన్ సినిమాలు అన్నట్టు ఉంటుంది. అలా బోరింగ్ ప్లే తో సినిమా చాలా సాగదీతగా అయితే చిరాకు తెప్పించేలా సాగుతుంది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ కానీ ఆ లెక్చర్లు మరింత ఇరిటేటింగ్ గా ఉంటాయి.

 

సాంకేతిక వర్గం :

 

ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు జస్ట్ యావరేజ్ అంతే. టెక్నీకల్ టీం లో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక సినిమాలోనే కంటెంట్ బాగోనప్పుడు అక్కడ ఎడిటర్ ఎంత చేసిన ఏం చేసినా ఎంత చేసినా ప్రయోజనం లేదు. డైలాగ్స్ బాగాలేవు.

ఇక దర్శకుడు డీన్ రాజ్ విషయానికి వస్తే చాలా వరస్ట్ వర్క్ ని ఈ సినిమాకి ఇచ్చి ఆడియెన్స్ ని నీరసపరుస్తాడు. అసలు సినిమా టైటిల్ కి అందులో కంటెంట్ కి సంబంధమే లేకుండా సినిమాని చాలా సిల్లీగా తీసాడు. సరైన కథ, కథనాలు లేవు. మెయిన్ గా అసలు దేశభక్తి అనే సున్నిత అంశాన్నే సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేదు.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే ఈ “భారతీయన్స్” చిత్రంలో అసలు ఎలాంటి మ్యాటర్ లేదు. పెద్దగా చెప్పడానికి పాజిటివ్ అంశాలు కూడా కనిపించని ఈ చిత్రం వరస్ట్ నరేషన్ తో దారుణంగా అయితే సాగుతుంది. దీనితో ఈ చిత్రానికి దూరంగా ఉండడమే మంచిది.

123telugu.com Rating: 1/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :