భారతీయుడు 2 ఆగిపోలేదట !

Published on Feb 20, 2019 10:11 am IST

కమల్ హాసన్ – శంకర్ కలయికలో తెరకెక్కతున్న ‘భారతీయుడు 2’ ఆగిపోయిందని గత కొద్దీ రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శంకర్ ఈచిత్రానికి భారీ బడ్జెట్ ను కోట్ చేశాడట అయితే లైకా అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి సినిమా ఆగిపాయిందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ వార్తాలపై క్లారిటీ వచ్చింది. సినిమాఆగిపోలేదని ఇప్పటికే రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తి అయ్యాయని త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నామని లైకా ప్రతినిధి స్పష్టం చేశారు.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :