ఉస్తాద్ రెస్పాన్స్ చూస్తుంటే పూనకం వస్తోంది – హరీష్ శంకర్

ఉస్తాద్ రెస్పాన్స్ చూస్తుంటే పూనకం వస్తోంది – హరీష్ శంకర్

Published on Mar 20, 2026 2:00 AM IST

ustaad bhagat singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై చిత్ర యూనిట్ ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది.

​ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. మాస్ ఎంటర్టైనర్ కాబట్టి పాజిటివ్ టాక్ రావడానికి కొంత సమయం పడుతుందని భావించానని, కానీ మార్నింగ్ షోల నుంచే అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై చూపిస్తానని తాను ముందు నుంచి చెబుతున్నానని, అదే రీతిలో ప్రేక్షకులు కూడా ఆయన మేనరిజమ్స్ మరియు ఎనర్జీని ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. కమర్షియల్ హంగులతో పాటు సినిమాలో మంచి కంటెంట్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

​ముఖ్యంగా తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఎవరూ తాకని ‘అక్రమ వలసదారులు’ అనే అంశాన్ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లు హరీష్ శంకర్ వెల్లడించారు. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉందని, ఈ సినిమా సంగీతం, ముఖ్యంగా ‘తొలిప్రేమ’ సాంగ్ రీమిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో థియేటర్లు ఇప్పుడు పూనకాలతో ఊగిపోతున్నాయి.

తాజా వార్తలు