రామరాజు రికార్డులను బ్రేక్ చేసిన భీమ్

Published on Oct 22, 2020 7:33 pm IST

రాజమౌళి రూపొందిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా నుండి ఈరోజు ఉదయం భీమ్ టీజర్ విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ టీజర్ కేవలం తెలుగు ప్రేక్షకలనే కాదు అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో నెలల నుండి కళ్లు కాయలు కాచేలా ఎన్టీఆర్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్స్, ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేసిన తీరు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇక భీమ్ ను పరిచయం చేస్తూ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే విశేషంగా ఆకట్టుకుంది.

దీంతో కొన్ని గంటల్లోనే టీజర్ కు విపరీతమైన లైక్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు అఫీషియల్ ఛానల్ నందు 760,000 లైక్స్ పొందింది తెలుగు టీజర్. ఇది గతంలో విడుదలైన రామరాజు టీజర్ పొందిన లైక్స్ కంటే ఎక్కువే. రామరాజు టీజర్ 729,000 లైక్స్ పొందింది. అంటే రామరాజు రికార్డును భీమ్ బీట్ చేసినట్టే. ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ టీజర్ విపరీతమైన లైక్స్ సాధించింది. అన్ని భాషల్లోనూ చరణే డబ్బింగ్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ టీజర్ దేశవ్యాప్తంగా సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేసింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More