వైరల్ అవుతున్న “భీమ్లా నాయక్” మాస్ కటౌట్.!

Published on Dec 28, 2021 9:00 am IST


మన టాలీవుడ్ నుంచి మాస్ ఆడియెన్స్ లో భారీ లెవెల్ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ కి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి సినిమా అయినా కూడా భారీ డే 1 పెట్టడం పవన్ కి చెల్లుతుంది. మరి ఇప్పుడు అలాంటి పవన్ ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో తన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” తో చూడబోతున్నామని మేకర్స్ అంటున్నారు.

రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఆల్రెడీ ఫిబ్రవరికి వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో భీమ్లా నాయక్ నుంచి పవన్ ది ఓ మాస్ పోస్టర్ బయటకొచ్చి వైరల్ అవుతుంది. భీమ్లా నుంచి ఓ ఫైట్ సీక్వెన్స్ లో ఫొటోలా కనిపిస్తుంది. పవన్ లుంగీ గెటప్ లో గ్లింప్స్ లోని కాస్ట్యూమ్ తో కనిపిస్తున్నాడు. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ భీమ్లా నాయక్ మాస్ కటౌట్ మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :