ఆల్రెడీ ఆల్ టైం రికార్డ్ పెట్టిన ‘భీమ్లా’ సాంగ్!

Published on Sep 3, 2021 8:15 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ల కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దసరాకుడ్ సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ మసాలా డ్రామా నుంచి నిన్ననే మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మరి చాలా అంచనాలతో వచ్చిన ఈ సాంగ్ అంతే రేంజ్ భారీ రెస్పాన్స్ కొల్లగొట్టేసింది.

నారి సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డు లనే టార్గెట్ పెట్టుకొని వచ్చిన ఈ సాంగ్ ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డ్స్ నే అందుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ సాంగ్ ఆల్రెడీ టాలీవుడ్ హైయెస్ట్ లైక్స్ ని బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. అంటే సాంగ్ రిలీజ్ 24 గంటల్లో వచ్చిన లైక్స్ పరంగా పుష్ప ఫస్ట్ సింగిల్ 6 లక్షల 57 వేలు లైక్స్ రాగా..

దీనిని ఎప్పుడో 7 లక్షల లైక్స్ తో భీమ్లా ఫస్ట్ సింగిల్ బ్రేక్ చేసి 8 లక్షల వైపు దూసుకెళ్తుంది. మరి 24 గంటలు పూర్తయ్యేసరికి 1 మిలియన్ కొడుతుందో లేదో అన్నది డౌట్ గానే ఉంది. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వాలారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :