అన్ని రికార్డ్స్ మాస్ హంట్ షురూ చేసిన “భీమ్లా నాయక్”.!

Published on Aug 15, 2021 3:21 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఈరోజే అదిరే మాస్ గ్లింప్స్ టీజర్ కట్ ను వదలగా దానికి భారీ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది.

మన టాలీవుడ్ లో ఏ సినిమా గ్లింప్స్ కి కూడా రానంత సాలిడ్ రెస్పాన్స్ ఈ వీడియోకి జస్ట్ నిమిషాలు గంటల వ్యవధిలోనే రావడం విశేషం. మరి జస్ట్ రెండు గంటల్లోనే ఆల్ టైం హైయెస్ట్ 3 లక్షల 95 వేల లైక్స్ తో రికార్డు సెట్ చేసి ఇప్పుడు 5 లక్షల మార్క్ ని కూడా క్రాస్ చేసి భీమ్లా ఇంకా ఇదే మాస్ స్పీడ్ ని ఇంకా కొనసాగిస్తున్నాడు.

అలాగే వ్యూస్ పరంగా కూడా ఫాస్టెస్ట్ రికార్డులనే సెట్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలుపుతున్నారు. మొత్తానికి మాత్రం భీమ్లా మాస్ హంట్ గట్టిగానే షురూ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :