పవర్ డే: భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Aug 30, 2021 6:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం కి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయ్యప్పనం కొషియం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రానా దగ్గుపాటి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ వీడియో మరియు ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ పై చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

భీమ్లా నాయక్ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2 వ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 2 వ తేదీన ఉదయం 11:16 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పవర్ డే రోజున రీ సౌండింగ్ పవర్ ఆంతెం ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దం గా ఉండండి అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రవి కే చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :