ఫన్ అండ్ రొమాంటిక్ గా భీష్మ టీజర్

Published on Jan 12, 2020 10:28 am IST

నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ టీజర్ వచ్చేసింది. నిమిషానికి పైగా ఉన్న భీష్మ టీజర్ లో నితిన్ ఎనర్జీ అండ్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. భీష్మ చిత్రాన్ని ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ మూవీ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించినట్టున్నారు. రష్మిక మందాన చాల క్యూట్ అండ్ గ్లామరస్ గా ఉంది. ఇక వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ భీష్మలో హైలెట్ గా నిలిచే అవకాశం కలదు. సంపత్ రాజ్ ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఓ కార్పొరేట్ ఎంపైర్ ని కాపాడడానికి వచ్చిన యువకుడిగా నితిన్ కనిపించే అవకాశం కలదు.

చాలా గ్యాప్ తరువాత ‘భీష్మ’గా వచ్చిన నితిన్ మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహంతి స్వర సాగర్ అందిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :