‘భీష్మ’ నితిన్ ఏంటి జయం ‘వెంకట్’ లా తయ్యారయ్యాడు…!

Published on Jun 13, 2019 1:09 am IST

వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్,రష్మిక మందాన జంటగా “భీష్మ” చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్ర యూనిట్. ఐతే ఈ కార్యక్రమంలో నితిన్ ని చూసిన ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే. ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ తరువాత బయటకనిపించని నితిన్ మేక్ ఓవర్ కొత్తగా అనిపించింది. నితిన్ చాలా సన్నబడటంతో పాటు, లైట్ షేవింగ్, సాధారమైన హెయిర్ స్టైల్ లో చాలా సాఫ్ట్ గా కనిపించాడు. ఇవాళ నితిన్ లుక్ చుసిన ఎవరికైనా తేజా దర్శకత్వంలో ఆయన చేసిన మొదటి సినిమా ‘జయం’ లో వెంకట్ గుర్తుకు రాక మానడు. ఏజ్ కూడా ఓ 10 ఇయర్స్ వెనక్కి వెళ్లినంత ఫ్రెష్ గా కనిపించాడు.

ప్రస్తుత మూవీ ‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుముల హీరో పాత్ర చాలా సాఫ్ట్ గా ఉంటుందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. కాబట్టి సినిమా పాత్ర కోసం ఇలా మారారా? అనే సందేహం కలుగుతుంది. ఏది ఏమైనా నితిన్ ట్రెడిషనల్ లుక్ లో భలే ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

More