టాలెంటెడ్ డైరెక్టర్ తో “భోళా శంకర్” సంస్థ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్.!

టాలెంటెడ్ డైరెక్టర్ తో “భోళా శంకర్” సంస్థ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్.!

Published on Feb 20, 2024 1:01 PM IST

మన టాలీవుడ్ లో తన చిత్రాలతో ఆడియెన్స్ లో ఒక స్పెషల్ మార్క్ ని వేసుకున్న అతి కొద్ది మంది టాలెంటెడ్ దర్శకుల్లో ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లేటెస్ట్ గా హారర్ థ్రిల్లర్ “ఊరు పేరు భైరవకోన” దర్శకుడు వి ఐ ఆనంద్ కూడా ఒకరు. మరి తాను మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు తన లైనప్ లో ఉండగా తన నెక్స్ట్ సినిమాపై ఇప్పుడు అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు లాక్ చేయడం ఇప్పుడు జరిగింది. లాస్ట్ గా వారి నుంచి మెగాస్టార్ తో చేసిన భోళా శంకర్ తర్వాత ఊరి పేరు భైరవకోన చిత్రాన్ని వీరే రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. ఇక మళ్ళీ ఇదే దర్శకుడితో తమ బ్యానర్ లో 27వ సినిమాని అయితే అనౌన్స్ చేయడం విశేషం. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే మరిన్ని డీటెయిల్స్ ఈ సినిమా విషయంలో మున్ముందు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు