ఆ హీరోయిన్ గోపీచంద్ కి అక్కగా..!

Published on Jan 29, 2020 10:12 am IST

టాలీవుడ్ లో ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్ అందరు స్టార్ హీరోలతో ఆడిపాదించి భూమిక. ఆమె ప్రస్తుతం యంగ్ హీరోలకు అక్క, వదిన లాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఎం సి ఏ చిత్రంలో నానికి వదినగా చేసిన ఈమె బాలయ్య నటించిన రూలర్ మూవీలో మరో కీలక పాత్ర చేయడం జరిగింది. తెలుగులో ఇలాంటి పాత్రలు చేస్తున్న భూమిక మరో హీరోకి అక్కగా నటించనున్నారని సమాచారం. యాక్షన్ హీరో గోపి చంద్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతుంది. కొద్దిరోజుల క్రితం ఈ మూవీ టైటిల్ పోస్టర్ తో పాటు గోపీచంద్ లుక్ కూడా విడుదల చేశారు.

సీటీమార్ అనే క్యాచి టైటిల్ నిర్ణయించగా మెడలో విజిల్ స్పోర్ట్స్ ట్రాక్ ధరించి ఉన్న గోపీచంద్ లుక్ ఆసక్తి కలిగించేదిగా ఉంది. సీటీమార్ మూవీలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తుండగా ఆయన సిస్టర్ గా భూమిక కనిపిస్తారట. ఈ మూవీలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో భూమికను తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది. సీటీమార్ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీనివాస్ చిత్తూరి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :