వైరల్ గా మారిన భూమిక హాట్ ఫోటో…!

Published on Nov 17, 2019 1:20 pm IST

సుమంత్ హీరోగా 2000లో వచ్చిన యువకుడు చిత్రంతో వెండితెరకు పరిచమైన భూమిక… ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగు, హిందీ, తమిళ భాషలో నటించిన భూమిక తరువాత చిన్నగా స్టార్ డమ్ కోల్పోయారు. ఈ మధ్య భూమిక క్యారెక్టర్ ఆరిస్ట్ గా ప్రాధాన్యం ఉన్న పాత్రలలో కనిపిస్తున్నారు. ఎంసిఏ చిత్రంలో హీరో నానికి వదినగా చేసిన ఈమె, యూ టర్న్, సవ్యసాచి చిత్రాలలో కూడా మంచి పాత్రలు చేయడం జరిగింది.

స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు మడికట్టుకొని కూర్చున్నా కానీ, అవకాశాలు తగ్గినప్పుడు చాలా మంది హీరోయిన్లు స్కిన్ షోకి రెడీ ఐపోతారు. కానీ భూమిక అవకాశాలు తగ్గినప్పుడు కూడా గ్లామర్ రోల్స్ చేసింది లేదు. అలాంటి ఆమె తాజాగా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఓ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. 41ఏళ్ల వయసులో భూమిక హాట్ పోజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఇలా స్కిన్ షో చేయడం వలన భూమికకు వరిగేది ఏముందని అందరూ అనుకుంటున్నారు. ఐతే ఆ ఫోటో లేటెస్ట్ దా, లేక గతంలో జరిగిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారా తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

More